NTV Telugu Site icon

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ..

Ttd

Ttd

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో ఏడు కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. తిరుమలలో భక్తుల రద్దీ అన్యూహంగా పెరిగినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి సెక్టార్‌కి ప్రత్యేకంగా అధికారులును కేటాయించామని తెలిపారు.. ప్రస్తుతం క్యూ లైన్‌లో చేరుకుంటున్న భక్తులకు.. శ్రీవారి దర్శనానికి రెండు రోజుల పాటు వేచివుండవలసిన పరిస్థితి ఉందన్నారు… క్యూ లైన్‌లో ఉన్న భక్తులుకు నిరంతరాయంగా ఆహార సౌకర్యాని కల్పిస్తున్నామని.. రేపు రాత్రికి భక్తుల తాకిడి తగ్గే అవకాశం ఉందన్నారు.. సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేలా వికేండ్‌లో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని.. వారపు ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినట్టు ప్రకటించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.

Read Also: Draksharamam: అపరిశుభ్రతపై కలెక్టర్‌ సీరియస్‌.. ఈవోతో ఫ్యాన్‌ తుడిపించి..!