NTV Telugu Site icon

12 People Killed: వరదల్లో గత రెండు రోజుల్లో 12 మృతదేహాలను గుర్తించిన అధికారులు

12members

12members

12 People Killed: బెజవాడ నగరం మూడు రోజులుగా వరద ముంపులో ఉంది. వరద తగ్గినా కాలనీల నుంచి ఇంకా బయటకు వెళ్ళని నీరు.. 8 అడుగుల నుంచి 3 అడుగులకు బుడమేరు వరద ఉదృతి చేరింది. ఇళ్లలో చిక్కుకున్న వారు రాత్రి నుంచే ఇళ్ళ నుంచి బయటకు వస్తున్న పరిస్థితి ఏర్పాడింది. గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేని పరిస్థితి కొనసాగుతుంది. ముంపు ప్రాంతాల్లో చివర వరకు తాగు నీరు, ఫుడ్, పాలు అందలేదు.. తిండి దొరక్క ముంపు ప్రాంతాల్లోని బాధితులు అల్లాడుతున్నారు. ఇక, పునరావాస కేంద్రాలకు 75 వేల మంది ప్రజలు వెళ్లారు. అయితే, వరదల్లో గత 2 రోజుల్లో 12 మృతదేహాలను ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు గుర్తించారు.

Read Also: Realme 13+ 5G Price: ‘రియల్‌మీ’ నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. తడి చేత్తోనూ వాడొచ్చు! డోంట్ మిస్ ఇట్

ఇక, వేల సంఖ్యలో గల్లంతైన ద్విచక్ర వాహనాలు, కొట్టుకుపోయి నీట మునిగిన కార్లు.. ప్రభుత్వ సాయం ఇంకా అందని వాళ్ళు ఇంకా వేలల్లో ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. నగరాన్ని ముంచిన బుడమేరుకు పడిన 3 గండ్లు పూడ్చి వేతకు మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే, ముంపుకు గురైన బాధితులకు ప్రభుత్వంతో పాటు బెజవాడ వాసులు, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. వరద నీటిలో చిక్కుకుని తిండి దొరకని వాళ్ళకి తాళ్ళతో భోజనం, సరుకులు నగర వాసులు అందిస్తున్నారు. ఇళ్లలో చిక్కుకుని బయటకు రాలేని వారిని మోసుకుని తీసుకు వస్తున్న యువత.. తమకు తోచినంత సాయాన్ని అందించటానికి నగర వాసులు ముందుకి వస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఉదయం, మధ్యాహ్నం వరద ప్రాంతాల్లో వారికి ఫుడ్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.