రాష్ట్ర ప్రభుత్వం ధరలను ఎందుకు తగ్గించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశం లోని చాలా రాష్ట్రాలు పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గిస్తే వైసీపీ మాత్రం ధరలు తగ్గించే విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ధరలు తగ్గించాలని కోరితే మంత్రులను బూతులు తిట్టడ మేంటని ఆయన జగన్‌ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రం ధరలు తగ్గించి ఉపశమనం కలిగించినా రాష్ట్రం ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయదని ఆయన మండిపడ్డారు.
రూ. 25 విలువ చేసే చీప్ లిక్కర్ బాటిల్‌ను రూ.250 అమ్మూతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందన్నారు. రాష్ర్టంలో ఇప్పటికే ఎయిడెడ్ స్కూళ్లను ఎత్తివేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందని ఆయన ఆరోపించారు. సమస్యలపై నిలదీస్తే మాపై నిందలు వేస్తున్నారని, వైసీపీ గుండాయిజం చేస్తుందని ఆయన ఆరోపించారు.
