NTV Telugu Site icon

Harsh Kumar: కాంగ్రెస్‌ పార్టీ కీలక పదవి.. తిరస్కరించిన హర్షకుమార్‌..

Harsh Kumar

Harsh Kumar

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలకమార్పులు చేసింది అధిష్టానం.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజుని నియమించింది అధిష్టానం.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి. రాకేశ్ రెడ్డిని.. ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్‌గా ఎంఎం పళ్లంరాజును.. క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్‌ను నియమించారు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అయితే, ఏఐసీసీ ఇచ్చిన పదవిని తిరస్కరించారు మాజీ ఎంపీ హర్షకుమార్.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ-మెయిల్ ద్వారా తిరస్కరణ లేఖ పంపారు హర్షకుమార్.

Read Also: Avanthi Srinivas: మాజీ మంత్రి అవంతికి షాకిచ్చిన జగన్‌.. అదికూడా పాయే..!

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా హర్షకుమార్‌ను బుధవారం రోజు నియమించారు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. అయితే, వెంటనే ఆ పదవిని తిరస్కరించారు హర్షకుమార్‌.. తాను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగానే కొనసాగుతానని పేర్కొన్నారు.. ఇదే సమయంలో.. కీలక ప్రస్తావన తీసుకొచ్చారు.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అన్ని రాజకీయపార్టీల అధ్యక్షులు అగ్ర కులాల వారేనని పేర్కొన్నారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ-రెడ్డి, తెలుగుదేశం పార్టీ-కమ్మ, జనసేన పార్టీ-కమ్మ, బీజేపీ-కాపు, సీపీఎం-రెడ్డి, సీపీఐ-బీసీ ఉన్నారని.. ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష పదవిని బ్రాహ్మణ వర్గానికి కట్టబెట్టిందని ఏఐసీసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు హర్షకుమార్‌. దీంతో.. ఆయన కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్ష పదవి ఆశించారా? అనే చర్చ సాగుతోంది..

కాగా, పీసీసీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్ర రాజు నియామకంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.. కేక్ కట్ చేశారు నూతన అధ్యక్షుడు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్.. టీడీపీ, వైసీపీ, జనసేన.. అన్నీ బీజేపీ గొడుగు కింద ఉన్న పార్టీలని ఆరోపించారు.. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల జరుగుతున్న నష్టంపై క్షేత్ర స్థాయికి తీసుకుని వెళ్తామన్నారు.. విభజన హామీల అమలు, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని.. రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రజల్లోకి బలంగా వెళ్లిందని తెలిపారు గిడుగు రుద్రరాజు. మరి ఇప్పుడు హర్షకుమార్‌ లేఖపై కాంగ్రెస్‌ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.