Harirama Jogaiah: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయా నేత హరి రామజోగయ్య ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తన దీక్ష కొనసాగిస్తున్నారు. అగ్రవర్ణాలలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లు కాపులకు ఐదు శాతం కేటాయించాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై డిసెంబర్ 30 తేదీ వరకు ప్రభుత్వానికి జోగయ్య సమయం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో జోగయ్య ఈరోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. దీక్ష ఆలోచన విరమించుకోవాలని పోలీసులు సూచించారు. జోగయ్య నిన్న రాత్రి నుంచి దీక్షలో ఉన్నట్టు ప్రకటించారు. దీంతో పాలకొల్లులో జోగయ్య ను అదుపులోకి తీసుకుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.. అయితే, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు నా దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు హరిరామ జోగయ్య.. జీవో నెంబర్ 60 రద్దు చేయాలని.. యాక్ట్14, 15 అమలులోకి తీసుకు రావాలంటున్నారు.. ఇక, నిన్న సాయంత్రం ఏడు గంటలకి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు.. అప్పటినుంచి నేను నిరాహార దీక్షలో ఉన్నానని వెల్లడించారు హరిరామ జోగయ్య.. మరోవైపు.. దీక్షలో ఉన్న హరిరామ జోగయ్య షుగర్ లెవెల్స్ పడిపోయాయి, బీపీ పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు.
Harirama Jogaiah: ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న హరిరామ జోగయ్య.. కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు దీక్ష..!

Harirama Jogaiah