Margani Bharat: బీసీ మహిళ, కృష్ణా జిల్లా జెడ్పి చైర్ పర్సన్ ఉప్పాల హరికపై తెలుగుదేశం గూండాలు రాళ్ల దాడికి తెగబడడం దారుణమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా ఖండించారు. భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్తుంటే రాళ్లతో దాడి చేయడం, అది కూడా పోలీసుల సమక్షంలో జరగడం చూస్తుంటే, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆయన వాపోయారు. మనం ఏపీలోనే ఉన్నామా లేక పాకిస్తాన్ లో ఉన్నామా అన్నట్టుగా వ్యవహారం ఉందన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఏడాదిపైగా వైసీపీ శ్రేణులపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారని మార్గాని భరత్ ఆరోపించారు.
Read Also: Teenmaar Mallanna: ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు.. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కార్యకర్తల దాడి..!
ఇప్పటికి, వేలాది మంది వైసీపీ కార్యకర్తలపై, నాయకులపై దాడులు చేస్తున్నారని మాజీ ఎంపీ భరత్ పేర్కొన్నారు. ఈ రోజు నాటిన విత్తనం రేపొద్దున మహా వృక్షమై పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలని హెచ్చరించారు. ఎప్పుడూ ఒకరి దగ్గరే అధికారం ఉండబోదు అనేది గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఉప్పాల హారికకు పూర్తిస్థాయిలో తాము అండగా ఉంటాం.. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అండగా నిలబడతామని కూడా చెప్పారని మార్గాని భరత్ తెలిపారు.
