AP Half Day Schools: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.. ఓవైపు ఇవాళ్టి నుంచే టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే కాగా.. ఒంటిపూట బడులు కూడా ఈ రోజు నుంచి ఆరంభం అవుతున్నాయి.. 1వ తరగతి నుండి 10వ తరగతులకు ఉదయం 7.45 నుండి 12.30 వరకు ఒంటిపూట పాఠశాలలను ప్రకటించింది విద్యాశాఖ.. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలలతో సహా అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో ఇవాళ్టి నుంచి అంటే 03-4-2023 నుండి చివరి పని దినం వరకు అంటే 30-4-2023 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు..
Read Also: UPI Transaction Limit: ఫోన్ పే, గూగుల్ పేలో రోజూ రూ.లక్షల్లో పంపుతామంటే కుదరదు
ఇదే సమయంలో .. ప్రత్యేకంగా ఎస్ఎస్‌సీ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో, పరీక్ష రోజుల్లో (మొత్తం ఆరు రోజులు) ఎలాంటి తరగతులు నిర్వహించారు.. ఈ పాఠశాలలు 03.04.23 నుండి 30.04.23 వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెలవు దినాలలో ఆరు రోజుల పాటు పరిహార తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.. పరిహార తరగతులు కూడా హాఫ్ డే షెడ్యూల్‌ను అనుసరించాల్సి ఉంటుంది.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే కాగా.. ఆ పాఠశాలల్లో పరీక్షల రోజుల్లో ఎలాంటి క్లాస్‌లు నిర్వహించరు. మరోవైపు.. ఏప్రిల్ నెలలో 2వ శనివారాన్ని పని చేసేదిగా పరిగణించాలి. అన్ని పాఠశాలల్లో తగినంత తాగునీరు అందించాలని.. బహిరంగ ప్రదేశాల్లో/ చెట్ల కింద తరగతులు నిర్వహించరాని విద్యాశాఖ ప్రొసీడింగ్స్ విడుదల చేసింది.
Read Also: Astrology : ఏప్రిల్ 3, సోమవారం దినఫలాలు
ఇక, విద్యార్థుల ఉపయోగం కోసం ప్రతి పాఠశాలలో కొన్ని ఓరల్ రీ-హైడ్రేషన్ సొల్యూషన్ (ORS) సాచెట్‌లను అందుబాటులో ఉంచుకోండి, ఏదైనా పిల్లవాడు సన్/హీట్ స్ట్రోక్ బారిన పడినట్లయితే, వైద్య & ఆరోగ్య శాఖ సమన్వయంతో వాటిని ఉపయోగించాలని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు.. మరోవైపు.. మధ్యాహ్న భోజన సమయంలో స్థానికులతో సమన్వయంతో విద్యార్థులకు మజ్జిగ అందించాలని స్పష్టం చేసింది విద్యాశాఖ.