Site icon NTV Telugu

Andhra Pradesh: విద్యార్థులకు గమనిక.. ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు

రోజుకు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. వేసవి తాపంతో అటు చిన్నారుల నుంచి ఇటు వృద్ధుల వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూళ్లకు సంబంధించి ఒంటి పూట బడుల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వేసవి తీవ్రత ఆధారంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7:30 నుంచి ఉ.11:30 గంటల వరకు స్కూళ్లు ఉంటాయని చెప్పారు. ఏప్రిల్ 27 నుంచి పదో తరగతి పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

మరోవైపు తెలంగాణలో ఇప్పటికే ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. మార్చి 16 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒంటిపూట బడులను నిర్వహిస్తోంది. ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒంటిపూట బడులను నిర్వహించాల‌ని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

https://ntvtelugu.com/how-to-prevent-sun-stroke-in-summer/
Exit mobile version