NTV Telugu Site icon

Anantapur: అప్పు తీర్చమంటే గన్ తో బెదిరించిన వ్యక్తులు.. అరెస్ట్ చేసిన పోలీసులు..

Untitled 23

Untitled 23

Anantapur: గన్ కల్చర్ అంటే అదో ఫ్యాషన్ అనుకుంటున్నారు ప్రస్తుతం కొందరు వ్యక్తులు. తీసుకున్న అప్పును తిరిగియ్యమంటే పిస్టల్ తో బెదిరించారు. చివరికి పోలీసుల చేతికి చిక్కారు. ఈ ఘటన అనంతపురం లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. అనంతపురం లోని గుత్తికి చెందిన ప్రశాంత్ నాయుడు అలానే ప్రకాశం జిల్లాకు చెందిన రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తు కలిసి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనుకున్నారు. అందుకుగాను పెద్దమొత్తంలో డబ్బు రవాణా చేసే వారిని అడ్డుకుని గన్ తో బెదిరించి ఆ సొమ్మును వాళ్ల సొంతం చేసుకోవాలి అనుకున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే వాళ్లకు గన్ కావాలి. ఈ నేపధ్యంలో ఝార్ఖండ్ రాష్ట్రంలో పిస్టల్ కొనుగోలు చేసారు.

Read also:iQoo 12 5G Launch: ఆండ్రాయిడ్‌ ఫన్‌టచ్‌ ఓఎస్ 14తో ఐకూ కొత్త ఫోన్‌!

వాళ్ల ప్లాన్ ప్రకారం పెద్ద మొత్తంలో డబ్బులు రవాణా చేసేవాళ్లను బెదిరించడం, అలానే తెలిసిన వ్యక్తుల దగ్గర అప్పు చేసి తిరిగియ్యమంటే గన్ తో బెదిరించడం, అలానే సెటిల్మెంట్లను ఒప్పుకుని సెటిల్మెంట్ల సమయంలో తుపాకీతో బెద్దిరించి అనుకున్న పనిని పూర్తి చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్లకు డబ్బులు అప్పుగా ఇచిన వ్యక్తి ఆ డబ్బులు తిరిగివ్వకాల్సిందిగా అడిగారు. దీనితో అప్పు ఇచ్చిన వ్యక్తిని పిస్టల్ తో బెదిరించారు. దీనితో ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గుత్తి పోలీసులు రంగం లోకి దిగారు. గన్ కల్చర్ వైపు వెళ్తున్న ప్రశాంత్ నాయుడుని, రామ్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు. అనంతరం వాళ్ల దగ్గర నుండి ఒక పిస్టోల్, ఒక మాక్సిన్, మూడు రౌండ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.