NTV Telugu Site icon

MP Ayodhya Rami Reddy: జగన్‌ సీఎంగా రాష్ట్రం ఆర్ధికంగా పుంజుకుంది.. 2.93 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి..!

Mp Ayodhya Rami Reddy

Mp Ayodhya Rami Reddy

MP Ayodhya Rami Reddy: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుందని.. అనేక సంస్కరణలు జరుగుతున్నాయని తెలిపారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై గొప్పలు చెప్పుకునే అవసరం వైసీపీ నాయకులకు లేదు.. గడిచిన మూడున్నర ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన వాస్తవ అభివృద్ధి మాత్రమే మేం ప్రజలకు చెప్పదలుచుకున్నాం అన్నారు. త్వరలో వైజాగ్ లో మెగా పారిశ్రామిక సమ్మిట్ పెడుతున్నాం.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి.. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అనేక సంస్కరణలు జరుగుతున్నాయని తెలిపారు.. పారిశ్రామిక, నిరుద్యోగ, ఉపాధి ,వ్యవసాయ రంగాల్లో అనేక సంస్కరణలు సీఎం జగన్ సాధించారని ప్రశంసలు కురిపించిన ఆయన.. రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి గణనీయంగా పెరిగింది.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని వెల్లడించారు.

Read Also: BBC Offices: బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజూ ఐటీ సర్వే.. అమెరికా ఏమందంటే?

జగన్ సీఎంగా రాష్ట్రం ఆర్ధికంగా బలం పుంజుకుంది.. తలసరి ఆదాయాన్ని పెంచుకుందున్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.. గతం కంటే తలసరి ఆదాయంలో 38 శాతం అభివృద్ధి సాధించాం.. కరోనా వంటి విపత్తును ఎదుర్కొని రాష్ట్రం పురోగతి సాధించిందన్నారు.. టీడీపీ ప్రభుత్వంలో మైనస్ 6.2గా ఉన్న వ్యవసాయ అభివృద్ధిని గాడిలో పెట్టి +8.2 శాతంగా మలచిన ముఖ్యమంత్రిగా సీఎం జగన్ నిలిచారాని ప్రశంసించారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నాం.. ఇక, 2 లక్షల 93 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని తెలిపారు. రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి సాగిస్తోంది.. పరిశ్రమలు అభివృద్ధి జరగాలి అంటే ప్రభుత్వాలు చొరవ చూపాలి.. అదే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం కొన్ని అప్పులు చేస్తుంటారు.. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్టం మంచి పొజిషన్‌లో ఉంది.. మన రాష్ట్రం విద్యపై పెడుతున్న పెట్టుబడి మన రాష్ట్ర ఆర్ధిక స్థితిని మార్చేస్తుంది.. మన యువతకు బంగారు భవిష్యత్ ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.

Show comments