Ambati Arrest: నల్లపాడు పీఎస్కు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు.. అంబటి అరెస్ట్ ను ఖండిస్తున్నాం..

  • అంబటి రాంబాబు ప్రోవోక్ చేశారన్న కారణంతో అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం..
  • నాయకులే కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేయించారు.. అంబటిని పోలీసులు కలవనివ్వడం లేదు..
  • టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది.. ఈ దాడులను ఖండిస్తున్నాం: వైసీపీ లీగల్ సెల్
Ambati

Ambati

Ambati Arrest: గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వచ్చారు. లాయర్ పోలూరి వెంకటరెడ్డిని అంబటిని కలిసేందుకు పోలీసులు అంగీకరించలేదు. ఈ సందర్భంగా వైసీపీ లీగల్ సెల్ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రోవోక్ చేశారన్న కారణంతో అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం అన్నారు. నిన్న అరెస్టు చేసి తీసుకొచ్చారు.. అంబటిని కలవడానికి వస్తే అనుమతించలేదు.. ప్రజాస్వామ్య దేశంలో మనోభావాలను వ్యక్తం చేసే హక్కు ఉంది‌.. నాయకులే కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేయించారు.. అంబటి రాంబాబుని భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

Read Also: Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్‌షాక్.. రూ.18 సిగరెట్ రూ.72!

అయితే, టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది అని వైసీపీ లీగల్ సెల్ వెంకట్ రెడ్డి అన్నారు. అధికారం ఉంది కదా అని దాడులు చేస్తూ పోతే ప్రభుత్వాలు మారితే వైసీపీ కార్యకర్తలను ఎవరూ ఆపలేరని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. వయస్సు దృష్ట్యా న్యాయవాదులను అనుమతించేందుకు పోలీసులు సహకరించాలి అని డిమాండ్ చేశారు.