Site icon NTV Telugu

Pemmasani Chandrasekhar: ఆదివాసి సంక్షేమమే కూటమి లక్ష్యం

Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar: ఆదివాసి సంక్షేమమే కూటమి లక్ష్యం అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌.. గుంటూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు మాధవి, రామాంజనేయులు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆదివాసి సంక్షేమమే కూటమి లక్ష్యం అన్నారు.. అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడు, వెన్నెలకంటి రాఘవయ్య వంటి మహాపురుషుల సేవలను గుర్తించాలన్నారు.. సీఎం చంద్రబాబు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆదివాసీలకు గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు.. అరకు కాఫీ బ్రాండ్ ద్వారా సాంస్కృతిక, ఆర్థిక ఐక్యతకు ప్రోత్సాహం కలిపిస్తోంది కూటమి సర్కార్‌ అన్న ఆయన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాలలో రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.. ఇక, మంత్రి నారా లోకేష్ పాఠశాలల పునరుద్ధరణలో సహకరిస్తున్నారని తెలిపారు.. ప్రధాని నరేంద్ర మోడీ ఏకలవ్య స్కూల్స్ ద్వారా పిల్లలకు మంచి విద్య అందిస్తున్నారని ప్రశంసించారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.

Read Also: Deputy CM Pawan Kalyan: పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక.. 1,500 మంది మహిళలకు చీరలు పంపిన పవన్‌..

Exit mobile version