NTV Telugu Site icon

Pemmasani: రాబోయే ఖరీఫ్ సీజన్కు కార్యాచరణ రూపొందించాలి..

Pemma Sani

Pemma Sani

గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ రంగంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అవసరమైన కార్యచరణ రూపొందించాలి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు వ్యవసాయమే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు అందించాలన్న ప్రయత్నం చేస్తున్నాం.. మార్కెట్లో కృత్రిమంగా విత్తనాల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, అధికారులు తొందరలోనే అందజేయాలి అని కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడించారు.

Read Also: Amitabh Bachchan: ఆ భయంతోనే టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్ చూడలేదు: అమితాబ్ బచ్చన్

ఇక, నకిలీ ఎరువులు, విత్తనాలపై అధికారులు నిఘా పెట్టాలి అని కేంద్రమంద్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎన్ని రాజకీయ ఒత్తిడిలు వచ్చినా రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు అని హెచ్చరించారు. మార్కెట్లో దొరికే విత్తనాల నాణ్యతపై ల్యాబ్ ల ద్వారా పరీక్షలు జరిపించాలి అని పేర్కొన్నారు. రాబోయే వర్షా కాలంలో వాటర్ మేనేజ్మెంట్ కీలకమైనది.. ఇప్పటి వరకు పూడికతో పేరుకుపోయిన.. ఇరిగేషన్ కెనాల్స్ ను మూడు, నాలుగు వారాల్లోపు పూర్తి స్థాయిలో క్లీన్ చేయిస్తామన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై రైతులు ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.