Site icon NTV Telugu

Police Harassment: సత్తెనపల్లిలో పోలీసుల వేధింపులు.. రౌడీ షీటర్ ఆత్మహత్యాయత్నం..

Satenapally

Satenapally

Police Harassment: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వేదింపులు తాళలేక రౌడీ షీటర్ ఖాసీ సైదా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ కేసులో సత్తెనపల్లి టౌన్ సీఐ బ్రహ్మయ్య, రైటర్ రవీంద్ర మామూళ్లు డిమాండ్ చేశారని రౌడీ షీటర్ ఆరోపించారు. సత్తెనపల్లి మండలం పాకాలపాడు దగ్గర ఆత్మహత్యా యత్నంకు పాల్పడ్డాడు. ఇక, బాధితుడు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి రౌడీ షీటర్, పోలీస్ స్టేషన్ రైటర్ రవీంద్ర మధ్య జరిగిన ఫోన్ సంబాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితుడు ఖాసీ సైదా వడ్డీకి తెచ్చి డబ్బులు ఇవ్వాలని ఫోన్ లో రైటర్ రవీద్ర డిమాండ్ చేశారు. గతంలో రౌడీ షీటర్ పై నమోదు అయినా ఎస్సీ, ఎస్టీ కేసు కొట్టి వేయాలంటే డబ్బులు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.

Read Also: Crime News: దుబాయ్‌లో దారుణం.. పాకిస్తానీ చెతిలో తెలంగాణకు చెందిన ఇద్దరు హత్య

ఇక, ఈ ఘటనకు సంబంధించి వివాదం చెలరేగడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. రౌడీ షీటర్ ఖాసీ సైదా చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి సీఐ, స్టేషన్ రైటర్ రవీంద్రపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా ఇలాంటి వసూల్లకు పాల్పడిన తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తేల్చి చెప్పారు.

Exit mobile version