Site icon NTV Telugu

Tulluru DSP Murali Krishna: నందిగం సురేష్ అరెస్ట్.. తుళ్లూరు డీఎస్పీ కీలక వ్యాఖ్యలు..

Dsp

Dsp

Tulluru DSP Murali Krishna: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టుపై తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ఉద్దండరాయునిపాలెం గ్రామంలోని బొడ్డురాయి సెంటర్లో నిలబడి ఉన్న రాజు అనే వ్యక్తిపై నందిగం సురేష్, అతని అన్న మరో ఇద్దరు కారుతో గుద్దారని తెలిపారు. పాత కక్షలు ఉండటంతోనే దాడి చేశారు.. సురేష్ సోదరులు రాజును కొట్టి బైకుపై ఇంటికి తీసుకుని వెళ్లారు.. ఇంటి దగ్గర కూడా పడేసి కాళ్లతో బాధితుడు రాజును కొట్టడం జరిగింది.. రాజును చంపి కృష్ణా నదిలో పడెయ్యాలని నందిగం కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం జరిగిందని ఫిర్యాదులో రాజు చెప్పాడు.. వారి దగ్గర నుంచి రాజు పారిపోయాడు అని డీఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు.

Read Also: Palla Srinivasa Rao: కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహిస్తాం..

అయితే, బంధువులు, కుటుంబ సభ్యుల సాయంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి బాధితుడు రాజు చికిత్స పొందుతున్నాడు అని తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ పై 12 కేసులు ఉన్నాయి.. అందులో ఒక హత్య కేసు కూడా ఉందన్నారు. అన్ని కేసుల్లో సురేష్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు.. కండీషన్ బెయిల్ పై ఉండి కూడా ఒక వ్యక్తిని చంపుతాను అని బెదిరించడంతో వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది.. ఈ కేసులో మిగిన వారిని త్వరలో అరెస్ట్ చేస్తాం.. అయితే, నందిగం సురేష్ పై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం అన్నారు. సురేష్ పై సెక్షన్ 140(1), 127(2), 109(1),351(2), R/W 3(5), BNS క్రింద కేసు నమోదు చేశామని డీస్పీ మురళీ కృష్ణ వెల్లడించారు.

Exit mobile version