Heart Attack: గుండెపోటు ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయింది.. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు.. నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉన్నవాళ్లు.. కనీస వ్యాయామం చేయని వాళ్లు అనే తేడాలేకుండా.. ఈ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.. ఇక, పోలీసు డిపార్ట్‌మెంట్‌లోనూ ఎంతో మంది గుండె పోటుకు బలిఅయ్యారు.. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ ఎస్సై గుండెపోటుతో మృతిచెందాడు.. తుళ్లూరు ట్రాఫిక్ ఏఎస్సైగా పనిచేస్తున్న రవీంద్ర.. ఈ రోజు మందడంలో విధులు ముగించుకుని కారు డ్రైవ్ చేస్తూ గుంటూరు వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు.. తుళ్ళూరు దాటగానే ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో కారు ఆపారు రవీంద్ర. కొద్దిసేపటికే కారులోనే ప్రాణాలు కోల్పోయాడు.. కారు అద్దాలు పగులగొట్టి రవీంద్రను బయటకు తీశారు స్థానిక పోలీసులు. తుళ్లూరులోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఏఎస్సై రవీంధ్ర మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. రవీంద్ర వయస్సు 55 సంవత్సరాలుగా చెబుతున్నారు..
Read Also: TDP MLA in Controversy: వివాదంలో టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే
