దేశంలో అన్ని పండగల కంటే గణేష్ చతుర్థిని అందరూ చాలా ఇష్టంగా జరుపుకుంటారు. నవరాత్రుల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ఎంతో హడావిడిగా ఉంటుంది. ఈ పండుగ వేళ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుని.. కొన్ని కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. వినాయకుడి మండపాల దగ్గర విద్యుత్ షాక్ తో కొందరు బలి అవుతుంటే.. మరికొందరు నిమజ్జనానికి వెళ్లి చనిపోతున్నారు.
Read Also: CM Chandrababu: 10 రోజుల తర్వాత నివాసానికి సీఎం.. ప్రతీ రోజూ క్షేత్రస్థాయి పర్యటన
తాజాగా.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు పిల్లలు చెరువులో పడి గల్లంతయ్యారు. వారికోసం చెరువులో దిగి గాలింపు చర్యలు చేపట్టగా.. లభ్యమయ్యారు. ఒడ్డుకు తీసుకొచ్చి చూసేసరికి వారు చనిపోయి ఉన్నారు. 24 వార్డుకి చెందిన సంతోష్, వెంకట సుధీర్ అనే ఇద్దరు చిన్నారులుగా గుర్తించారు. అనంతరం.. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం.. మృతదేహాలను ప్రభుత్వ హాస్పటల్ కి తరలించారు.
Read Also: JK Polls: అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అఫ్జల్ గురు సోదరుడు
మరోవైపు.. అన్నమయ్య జిల్లాలో కూడా విషాదం చోటు చేసుకుంది. బి. కొత్తకోట మండలం నాయనబావిలో.. వినాయక చవితి ఉత్సవాలలో డ్యాన్స్ చేస్తూ ఆకాష్(19)అనే యువకుడు గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో.. వెంటనే యువకుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.