Site icon NTV Telugu

Guntur: గుంటూరు టీడీపీలో వర్గ విభేదాలు.. ఎమ్మెల్యేను అడ్డుకున్న నేతలు

Guntur Tdp

Guntur Tdp

గుంటూరు తూర్పు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. భగత్ సింగ్ జయంతి సందర్భంగా 1వ వార్డులో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు స్థానిక టీడీపీ మహిళా నేతలు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. అయితే.. వార్డులో కార్యక్రమాలు నిర్వహించే సమయంలో స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌ను అడ్డుకున్నారు టీడీపీ డివిజన్ స్థాయి నాయకులు.. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు, డివిజన్ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో.. అక్కడున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Exit mobile version