NTV Telugu Site icon

Guntur: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన సచివాలయ ఉద్యోగి రాజారావు.. ఎలుకల మందు ఇచ్చి..

Love

Love

ప్రేమ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకపు యువతులను లోబర్చుకుని ప్రాణాలు తీస్తున్నారు. చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఈ క్రమంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు సచివాలయ ఉద్యోగి రాజారావు. అంతేకాదు. యువతిని వదిలించుకునేందుకు జనవరి 15న ఎలుకల మందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించి రాక్షసత్వం ప్రదర్శించాడు రాజారావు. తనను మోసం చేసిన సచివాలయ ఉద్యోగి రాజారావుపై భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సచివాలయ ఉద్యోగి రాజారావు యువతి చదువుకునేటప్పటి నుంచి ప్రేమ పేరుతో వెంటపడేవాడు. తనను ప్రేమించాలని బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో అతడి ప్రేమలో పడిన యువతికి బిగ్ షాక్ ఇచ్చాడ రాజారావు. జాబ్ వచ్చిన తర్వాత వివాహం చేసుకోమని యువతి కోరగా మొహం చాటేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో జనవరి 15న ప్రేమ పెళ్లి వ్యవహారంపై యువతికి రాజారావుకు మధ్య వివాదం చోటుచేసుకుంది.

ఆ యువతిని వదిలించుకునేందుకు నువ్వు చనిపోవాలనుకుంటే ఎలుకల మందు తిని చనిపో అంటూ యువతిని బెదిరించాడు. అంతేకాదు యువతికి ఎలుకల మందు పేస్టు ప్యాకెట్లు తెచ్చి ఇచ్చాడు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన యువతి ఎలుకల మందు తిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. ప్రేమ, పెళ్లి పేరుతో తనని మోసం చేసిన రాజారావుపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.