NTV Telugu Site icon

Bouncer Murder Case: బౌన్సర్‌ మృతి కేసులో ట్విస్ట్..! భార్యను అసభ్యంగా దూషించాడని హత్య..

Bouncer Murder Case

Bouncer Murder Case

bouncer Murder Case: గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన, ఓ హత్య కేసు సంచలనం కలిగించింది.. ఎందుకంటే హత్యకు గురైన వ్యక్తి, గతంలో సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పని చేసాడు.. అలాంటి బౌన్సర్‌ను హత్య చేశారంటే ఏం జరిగిందో అన్న ఆసక్తి ప్రజల్లో ఉంటే, పోలీసులకు మాత్రం టెన్షన్ పట్టుకుంది.. ఈ హత్య కేసు ఏమయింటుందో , ఎంతమంది హత్య చేసి ఉంటారో, మరి ఎంతమంది ప్లాన్ చేసి ఉంటారు,అని పోలీసులు అలర్ట్ అయిపోయారు… తీరా హత్య కేసు ను ఆరా తీసిన పోలీసులకు, చివరకు హత్య జరిగిన విషయం విని విస్తుపోయారు ….

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన హత్య కేసు చిక్కుముడి వీడింది.. బౌన్సర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.. తెనాలి రూరల్ పోలీసుల కథనం ప్రకారం , సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పని చేసే కోటేశ్వరరావు, గతంలో అనేక మంది సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పని చేశాడు.. మరికొద్ది రోజులు పోలీసు వాహనాలకు ప్రైవేటు డ్రైవర్‌గా ర్గా పనిచేసేవాడు.. బౌన్సర్ గా పని చేసే కోటేశ్వరరావు బలిష్టంగా ఉంటాడు.. అలాంటి వ్యక్తిని హత్య చేశారంటే, దాని వెనక బలమైన కారణాలు ఉంటాయని, కనీసం ఇద్దరూ లేరా ముగ్గురు, ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చునని, మొదట్లో పోలీసులు భావించారు.. కానీ, హత్య జరిగిన తర్వాత రంగంలో దిగిన పోలీసులు తమ దర్యాప్తులో, షఫీ అనే ఒక వ్యక్తిని అనుమానించారు.. బౌన్సర్ కోటేశ్వరరావుకు అత్యంత సన్నిహితంగా మెలిగే షఫీ ,బౌన్సర్ కోటేశ్వరరావు హత్య జరిగే రోజు ఇద్దరు కలిసే ఉన్నారు.. అంటే హత్య జరిగే విషయం గానీ, హత్యకు సంబంధించిన విషయం కానీ, షఫీకి తెలిసే ఉంటుందని భావించారు పోలీసులు.. కానీ, ఆ తర్వాత దర్యాప్తులో మాత్రం అసలు హత్య చేసిందే షఫీ అని తెలుసుకొని నిర్ధాంత పోయారు. దీనికి కారణాలు తెలుసుకొని మరింత షాక్‌కు గురయ్యారు పోలీసులు..

Read Also: Jagtial News: సార్ కాపాడండి.. ఇరాక్ లో జగిత్యాల యువకుడి ఆవేదన..

బౌన్సర్ కోటేశ్వరరావుకు ఆదం షఫీకి మధ్య పదివేల రూపాయల వ్యవహారంలో వివాదం ఉంది.. ఈ వివాదంలో తరచు గొడవపడేవారు.. అయితే మాటల మధ్యలో కోటేశ్వరరావు నోరు జారాడు.. 10,000 ఇవ్వకపోతే నీ భార్యను నా దగ్గరకు పంపించు, అంటూ తన మనసులోని మాటను బయట పెట్టకనే పెట్టాడు.. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన షఫీ ఆ రోజుకు మౌనంగా ఉన్నాడు.. ఎందుకంటే బౌన్సర్ పని చేసే కోటేశ్వరరావు బలంగా ఉంటాడు.. తాను ఒక్కడినే కోటేశ్వరరావును ఎదుర్కోలేనని భావించిన షఫీ అదును కోసం ఎదురుచూశాడు.. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్ నుంచి తెనాలికి చేరుకున్నాడు కోటేశ్వరరావు.. అయితే, కోటేశ్వరరావుకు మద్యం అలవాటు ఉంది.. ఆ మద్యం ఆశ చూపించి పీకల దాకా తాగించి, పైకి పంపించేయాలి అనుకున్నాడు షఫీ.. అనుకున్నది తడువుగా ప్లాన్ వేశాడు.. ఈనెల ఒకటవ తేదీన కోటేశ్వరరావును మందు తాగుదాం అంటూ ఆహ్వానించాడు షఫీ.. ఈ లోపుగా పేరిశెట్టి కోటేశ్వరరావు వేరే మిత్రులతో మధ్యాహ్నం నుంచి మందు తాగడం ప్రారంభించారు.. ఇంకేముంది నా ప్లాన్ మరింత సులువు అవుతుందే అని లోలోపల అనుకున్న షఫీ అదును కోసం ఎదురు చూశాడు.

Read Also: Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. వినేష్ ఫొగట్ ఘన విజయం!

ఆ రోజు మధ్యాహ్నం తాగింది చాలదు అన్నట్లుగా, సాయంత్రం తెనాలిలోని ఒక వైన్ షాపులో మందు కొనుక్కొని మరీ తెనాలి శివారు ప్రాంతంలోని పాడుపడిన బండలపై దుకాణం పెట్టారు.. కోటేశ్వరరావును పీకలు దాకా తాగించాడు ఆదం షఫీ.. మద్యం మత్తులో పూర్తిగా మునిగిపోయిన కోటేశ్వరరావును, అప్పటికే ముందస్తు ప్లాన్ తో తనతో తెచ్చుకున్న కత్తితో కసితీరా గొంతు కోసేసాడు.. దీంతో స్పాట్‌లోనే గిలగిలా కొట్టుకొని చనిపోయాడు బౌన్సర్ కోటేశ్వరరావు.. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షఫీ చెప్పిన మాటలు విని షాక్ తగిలాయి.. కేవలం 10,000 రూపాయలు వ్యవహారంలో తన భార్యను అవమానించాడు, అసభ్యంగా దూషించాడు అనే కోపంతో షఫీ.. బౌన్సర్ కోటేశ్వరరావు హత్య చేశాడనే విషయం తెలుసుకొని విస్తు పోయారు పోలీసులు.. చేసిన నేరం ఒప్పుకున్న ఆదం షఫీని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Show comments