NTV Telugu Site icon

Nandigam Suresh: జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్‌.. వైఎస్‌ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..

Nandigam Suresh

Nandigam Suresh

Nandigam Suresh: గుంటూరు జిల్లా జైలు నుండి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ విడుదలయ్యారు.. టీడీపీ కార్యకర్త రాజుపై దాడికేసులో సోమవారం రోజు సురేష్‌కు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. అయితే, షూరిటీలు సమర్పించడంలో అలస్యం కావడంతో ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు నందిగం సురేష్.. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నాకు ఆరోగ్య పరిస్థితి బాగా లేకున్నా జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారు.. పైన ఉన్న దేవుడు అన్ని చూస్తున్నాడన్న సురేష్‌.. నాకు ఉన్న ఏకైక కోరిక మరణం వరకు జగనన్నతోనే ఉంటానని పేర్కొన్నారు.. ఆయన (వైఎస్‌ జగన్‌) మనిషిగా మాత్రమే చనిపోతా.. ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, నష్టాలు పెట్టినా.. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంటా అన్నారు. ఇక, కూటమి పాలనలో అరాచకాలు శృతిమించాయని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. పాలన పక్కనపెట్టి, కక్షలకే పరిమితమయ్యారు. దేవుడి భయం ఉన్న ఎవరు ఇలాంటి పనులు చేయరు. పైనున్న భగవంతుడు అన్నీ చూస్తున్నాడని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ నందిగం సురేష్‌..

Read Also: Vismaya Mohanlal: కూతుర్ని హీరోయిన్ గా లాంచ్ చేస్తున్న మోహన్ లాల్

మరోవైపు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఇప్పటికి రెండుసార్లు జైలుకు తీసుకువచ్చారు. మొదటిసారి ఇదే గుంటూరు సబ్ జైల్లో 145 రోజుల పాటు నందిగం సురేష్ ను ఉంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గడిచిన 14 నెలల్లో సగంకాలం నందిగం సురేష్ జైలులోనే గడిపారు. నందిగం సురేష్ ఏ తప్పు చేయకుండానే జైలు జీవితం గడిపారు. చంద్రబాబు, లోకేష్ కేవలం రాజకీయ కక్షతోనే అక్రమ కేసులతో సురేష్ ను జైలులో పెట్టారు. చంద్రబాబు సుపరిపాలన తొలి అడుగులో నందిగం సురేష్ రెండుసార్లు జైలుకు వెళ్లారు అని పేర్కొన్నారు… చంద్రబాబు తొలి అడుగులో 14 సార్లుకు పైగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలను రిసీవ్ చేసుకునేందుకు గుంటూరు సబ్ జైలు వద్దకు వచ్చాను. అక్రమ కేసులతో కారాగారంలో బంధించి, భయపెట్టాలని చంద్రబాబు సుపరిపాలనలో చేస్తున్నారు.. నా రాజకీయ జీవితంలో ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు..

Read Also: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్

మా పార్టీ నాయకులు అనేకమంది ఇంకా జైల్లో ఉన్నారు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరోసారి అక్రమ కేసు పెట్టాలని ప్రయత్నం చేశారని విమర్శించారు అంబటి రాంబాబు.. నందిగం సురేష్ భార్య మొదట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఆమె కేసు తీసుకోలేదు. నందిగం సురేష్ భార్య ఫిర్యాదు చేసిన అతని ఫిర్యాదు నమోదు చేసి నందిగం సురేష్, అతని భార్య, నందిగం సురేష్ సోదరుడిపై అక్రమ కేసు నమోదు చేశారు.. అయినా, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు. అక్రమ కేసులపై గట్టిగా పోరాటం చేస్తాం. పోలీసులతో వైసీపీని అణచాలనే ఆలోచన మార్చుకుంటే మంచిది, లేదంటే అది మీ ఖర్మ.. చంద్రబాబు తొలి అడుగుని మేము తీసి పక్కన పడేస్తాం.. మమ్మల్ని తొక్కాలని చూడడం చంద్రబాబు అవివేకం అని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..