NTV Telugu Site icon

YSRCP: వైసీపీకి మరో షాక్‌.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై..

Maddali Giri

Maddali Giri

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. ఇప్పటికే వైసీపీకి గండి కొట్టి పలు మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది తెలుగుదేశం పార్టీ.. మరికొందరు నేతలు కూడా పార్టీని వీడుతున్నారు.. ఇక, తాజాగా, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మద్దాలి గిరి.. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. ప్రస్తుతం వైసీపీ గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కొందరు నేతలు పార్టీని వీడుతున్న తరుణంలో.. ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర పార్టీ అధ్యక్ష పదవితో పాటు వైసీపీ క్రియాశీలక సభ్యతానికి కూడా రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి.. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనతోనే వైసీపీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. మరి, ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారా..? తిరిగి టీడీపీ గూటికి చేరుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

Read Also: Komati Reddy Venkat Reddy: రహదారుల నిర్మాణాలపై సెక్రటరీతో మంత్రి చర్చలు..

Show comments