NTV Telugu Site icon

Janga Krishna Murthy: గురజాలలో పోటీ చేసే హక్కు నాకు ఉంది..

Janga

Janga

గురజాలలో పోటీ చేసే హక్కు నాకు ఉంది.. అందుకే అధిష్టానాన్ని సీటు కోరుతున్నాను అని ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి అన్నారు. గతంలో రెండు సార్లు నేను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను.. 2019లో కూడా పార్టీ అవసరాల మేరకే నేను సీటు త్యాగం చేశాను.. అయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ నన్ను అనేక అవమానాలకు గురి చేశాడు.. ఎమ్మెల్యే ఓ వర్గం వాళ్ళకి మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారు.. ఎందుకు అలా జరుగుతుందో పార్టీ గమనించాలి అని ఆయన అన్నారు. ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్ గా ఉన్న నన్ను కలవడానికి కూడా వైసీపీ క్యాడర్ పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు. మా పార్టీ బీసీ సాధికారిక కోసం కట్టుబడి ఉందని నమ్ముతున్నా.. అందుకే బీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నాను అని కృష్ణామూర్తి చెప్పారు.

Read Also: Tollywood: మీ చుట్టూ సోషల్ మీడియా తిరగాలి కానీ.. మీరు తిరిగితే ఎలా?

జిల్లాలో ఒకళ్ళకు, ఇద్దరుకి బీసీలకు టికెట్లు ఇవ్వాలని రూల్ ఏమీ లేదు అని జంగా కృష్ణమూర్తి చెప్పుకొచ్చారు. అవసరాన్ని, గెలుపు గుర్రాలను బట్టి ఎన్ని టికెట్లు అయినా ఇవ్వొచ్చు.. నా కార్యకర్తలతో సమావేశం పెట్టుకోవడం తప్పు ఏమీ కాదు.. ఎమ్మెల్యే సమావేశాలకు నన్ను పిలవనప్పుడు, నేను ఎమ్మెల్యేని సమావేశానికి ఎందుకు పిలుస్తాను అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయం అధిష్టానానికి కూడా చెప్పాను.. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నాను అని ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి వెల్లడించారు.