Site icon NTV Telugu

నాగార్జున వర్సిటీ వీసీ పై మరోసారి విచారణ కమిటీ నియామకం…

నాగార్జున వర్సిటీ వీసీ రాజశేఖర్ పై మరోసారి విచారణ కమిటీ నియామకం చేసారు. రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై కమిటీ ఏర్పాటు చేసారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆరోపణలపై విశ్రాంత ఐఏఎస్‌తో కమిటీ ఏర్పడింది. ఆరోపణలు వాస్తవమేనని గతంలో ప్రభుత్వానికి చక్రపాణి కమిటీ నివేదిక అందించింది. ప్రభుత్వం మారడంతో చక్రపాణి కమిటీ నివేదికపై చర్యలు నిలిపేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న రాజశేఖర్ కు పూర్తిస్థాయి అదనపు వీసీగా బాధ్యతలు అప్పగించారు. రాజశేఖర్ కు బాధ్యతలు ఇవ్వడంపై తోటి అధ్యాపకురాలు ఫిర్యాదు చేసింది. రత్నషీలా ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం చర్యలు చెప్పటింది. ముగ్గురు సభ్యులతో కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 90 రోజుల్లో కమిటీ నివేదిక సమర్ఫించాలని తెలిపింది.

Exit mobile version