Komatireddy Rajagopal Reddy: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.. గుంటూరులో ఉడుముల సాంబిరెడ్డి 15వ వర్దంతి సందర్భంగా విద్యార్థినులకు స్కాలర్‌షిప్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజగోపాల్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్సార్ శిష్యులన్నారని గుర్తుచేసుకున్నారు.. వైఎస్సార్ చనిపోతే కంటతడి పెట్టని వ్యక్తి లేరని, బాధపడని కుటుంబం లేదన్నారు. వైఎస్సార్ కుటుంబంపై ఇప్పటికీ మాకు అభిమానం ఉందన్నారు. రాజశేఖరరెడ్డి చేపట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఇంకా ప్రజల్లో ఉన్నాయన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌కి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కలవడానికి వస్తున్నానని ప్రచారం చేస్తున్నారన్నారు.. కానీ, ఆ ప్రచారాన్ని తాను ముందే ఖండించానన్నారు మునుగోడు ఎమ్మె్ల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి..
Read Also: YSR Congress Party: ఛలో మెడికల్ కాలేజీలకు వైసీపీ పిలుపు.. ఆందోళనలకు అనుమతి లేదంటున్న పోలీసులు..
డబ్బు ఉండి దానం చేయని వారు నా దృష్టిలో నేరస్తులు.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నారు కోమటిరెడ్డి.. బాగా చదువుకొని పేద ప్రజలకు సహాయం చేయాలని మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది.. మా అమ్మ చెప్పిన మాట ప్రకారం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాను అన్నారు.. సామాజిక కార్యక్రమాలు చేయడంలో, మానవతా దృక్పథంతో సహాయం చేయడంలో ఉన్నంత తృప్తి దేంట్లోను ఉండదు అన్నారు.. 15 కోట్లతో జనగామ జిల్లా కేంద్రంలో మహిళల అనాధాశ్రమాన్ని నిర్మించాను.. మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో మంచి ప్రతిభ చూపిన వారికి 28 లక్షల నగదు బహుమతి అందించాం. వైఎస్సార్ ను స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను అని గుర్తుచేసుకున్నారు.. అయితే, నేను ఏది మాట్లాడినా.. ఎటు వెళ్లిన చర్చకు దారితీస్తోంది.. మా మిత్రుడు వేణుగోపాలరెడ్డి ఆహ్వానం మేరకు ఇక్కడికి వస్తే జగన్ ను కలవడానికి వస్తున్నారని ప్రచారం చేశారు.. నేను వెంటనే మీడియా ముందు ఈ ప్రచారాన్ని ఖండించాను అన్నారు.. కాగా, భారీ కాన్వాయ్‌తో గుంటూరు పర్యటనకు వెళ్లారు రాజగోపాల్ రెడ్డి.. ఇక, ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసిన విషయం విదితమే..
