Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై గతంలో నమోదయిన క్రిమినల్ కేసు తొలగించింది కోర్టు.. పవన్ కల్యాణ్‌పై అభియోగాలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్.శరత్ బాబు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో.. వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై 2023, జులై 29 న గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు చేశారు.. దీంతో పవన్ కల్యాణ్ పై 499, 500 ఐసీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.. అయితే, దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు పవన్ కల్యాణ్.. తాజా విచారణలో తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు పేర్కొన్నారు.. దీంతో.. కేసును ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు.. కాగా, గత ప్రభుత్వ హయాంలో పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.. పవన్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు టార్గెట్ చేసిన విషయం విదితమే..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్