Rishiteswari Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసును కొట్టివేసింది గుంటూరు కోర్టు.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా, రిషితేశ్వరి కేసు కొట్టేస్తున్నామని తుది తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా ఐదవ కోర్టు.. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే.. అయితే, 2015 జులై 14వ తేదీన నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని లేఖలో పేర్కొంది.. ఈ ఘటనపై అప్పట్లో సంచలనం సృష్టించింది.. బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులతో పాటు.. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఇలా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించగా.. నేడు గుంటూరు జిల్లా 5వ కోర్టు తుది తీర్పు వెలువరిచింది..
Read Also: Sivakarthikeyan : ఆర్మీ నుంచి అరుదైన అవార్డు అందుకున్న హీరో శివ కార్తికేయన్
అయితే, గుంటూరు కోర్టు తీర్పుపై రిషితేశ్వ రి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు.. మా అమ్మాయి రాసిన లెటర్ కూడా, ప్రతి అధికారికి అందించాం… వాటిని ఎందుకు ఈ కేసులో పరిగణనకు తీసుకోలేదో.. అర్థం కావడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.. మా బిడ్డ విషయంలో న్యాయం జరిగేందుకు, అవసరమైతే ముఖ్యమంత్రిని , ఉప ముఖ్యమంత్రిని కలుస్తాం అన్నారు.. మాకు పై కోర్టులకు వెళ్లి పోరాడే ఆర్థిక శక్తి లేదు.. ప్రభుత్వమే మా అమ్మాయి కేసు విషయంలో సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.. మా అమ్మాయి విషయంలో న్యాయం జరగకపోతే, మాకు మరణమే శరణ్యం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రిషితేశ్వ రి తల్లిదండ్రులు..