NTV Telugu Site icon

Posani Krishna Murali: పోసానికి బిగ్‌ రిలీఫ్‌.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే..?

Posani Gets Bail

Posani Gets Bail

Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట దక్కింది.. గతంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోసానిపై వివిధ ప్రాంతాల్లో మొత్తం 18 కేసులు నమోదు అయ్యాయి.. అయితే, ఇప్పటికే కొన్ని కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరు అయినా.. మరికొన్ని కేసుల్లో రిమాండ్‌లో ఉండడం.. అన్ని కేసులో బెయిట్‌ దక్కకపోడం.. మరికొన్ని కేసుల్లో 35 (3) Bns ఫాలో అవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. పోసాని జైళ్లలోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, ఇప్పటి వరకు ఉన్న కేసుల్లో పోసానికి ఊరట లభించింది.. ఇవాళ లేదా రేపు గుంటూరు జిల్లా జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.. ఇవాళ సీఐడీ కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజురు చేసింది గుంటూరు కోర్టు.. దీంతో, ఆయనకు బిగ్‌ రిలీఫ్‌ దక్కినట్టు అయ్యింది..

Read Also: Congress: పాకిస్తాన్ అంటే కాంగ్రెస్‌కి చాలా ప్రేమ.. ఇఫ్తార్ విందుకి వెళ్లడంపై బీజేపీ ఫైర్..

కాగా, పోసాని కృష్ణ మురళిని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్‌ చేశారు పోలీసులు.. హైదరాబాద్‌లోని రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న పోసానిని ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆ తర్వాత పోసానికి ఏపీకి తీసుకెళ్లారు.. పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.. 196, 353(2), 111 రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కింద ఆయనపై కేసులు పెట్టారు.. అయితే, వైసీపీ హయాంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పనిచేసిన పోసాని.. కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ను.. వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించిన వ్యవహారంలో.. పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి.. పీటీ వారెంట్లపై పలు పీఎస్‌లు, కోర్టులు, జైళ్లను తిరగాల్సిన పరిస్థితి వచ్చిన విషయం విదితమే..