NTV Telugu Site icon

Chicken and Egg Dishes Free: చికెన్‌, గుడ్లు ఫ్రీ.. ఫ్రీ.. వంటలు చేసి మరీ పంపిణీ..

Chicken And Egg

Chicken And Egg

Chicken and Egg Dishes Free: బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌ చికెన్‌, గుడ్ల అమ్మకాలపై ప్రభావం చూపుతోంది.. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు.. కృష్ణా జిల్లా.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోని ఫౌల్ట్రీ ఫామ్‌లలో బర్డ్‌ఫ్లూ వెలుగు చూసింది.. అలర్ట్‌ అయిన ప్రభుత్వం.. గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ వెలుగు చూసిన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా కూడా ప్రకటించి.. బర్డ్‌ఫ్లూ వ్యాప్తిచెందకుండా చర్యలకు దిగింది.. అయితే, ఇదే సమయంలో.. చికెన్‌, గుడ్లు తినొద్దనే వదంతులు గుప్పుమన్నాయి.. బాగా ఉడికించి తినే చికెన్‌, గుడ్లతో ఎలాంటి సమస్య ఉండదని వైద్య నిపుణులు, అధికారులు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా.. చికెన్‌, గుడ్ల అమ్మకాలపై మాత్రం ప్రభావం గట్టిగానే పడింది.. అయితే, ఇప్పుడిప్పుడే మళ్లీ వాటి అమ్మకాలు పుంజుకుంటున్నట్టు చికెన్‌, గుడ్ల ధరలను చూస్తే తెలిసిపోతోంది.. మరోవైపు.. బర్డ్‌ఫ్లూ వదంతులు పోగెట్టేందుకు సిద్ధమైన ఫౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు.. ఉచితంగా చికెన్‌, గుడ్లు పంపిణీ చేస్తున్నారు..

Read Also: PM Modi: ‘‘భాషా’’ ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండండి..

గుంటూరులో ఉచితంగా చికెన్‌ పంపిణీ చేశారు పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు.. బర్డ్ ఫ్లూ వదంతులతో పడిపోయిన చికెన్ అమ్మకాలను తిరిగి పుంజుకునేలా చేసేందుకు సిద్ధమయ్యారు.. నష్టాల పాలైన నేపథ్యంలో, పౌల్ట్రీ పరిశ్రమకు మద్దతుగా రంగంలోకి దిగి చికెన్ తినాలంటున్న ప్రజా ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు.. ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగా.. గుంటూరులోని స్వామి థియేటర్ ప్రాంగణంలో ప్రజలకు ఉచితంగా చికెన్, గుడ్ల వంటకాలను పంపిణీ చేశారు పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు.. ఉడికించిన చికెన్‌, గుడ్లు తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నసీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.. ఇక, చికెన్‌ వంటకాల కోసం ఆహార ప్రియులు భారీగా తరలివచ్చారు. ఊహించని విధంగా ప్రజలు తరలిరావడంతో నిర్వాహకులు గేట్లకు తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది.. మరోవైపు, హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో కూడా ఉచితంగా చికెన్‌, గుడ్ల వంటకాలు పంపిణీ చేయడంతో ప్రజలు ఎగబడ్డారు..