Site icon NTV Telugu

CPI Narayana: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను టార్గెట్‌ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?

Cpinarayana

Cpinarayana

CPI Narayana: అనేక సందర్భాల్లో సినీ హీరోలను టార్గెట్‌ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. ఇప్పుడు మరోసారి స్టార్‌ హీరోలు, హీరోయిన్స్‌పై విమర్శలు గుప్పించారు.. పాన్ మసాలా కొనమని స్టార్ హీరోలు, హీరోయిన్స్ ప్రచారం కల్పించడం బాధాకరమన్న ఆయన.. పాన్ మసాలా తయారీ కేంద్రాలను గుర్తించి సీజ్ చేయాలని సూచించారు.. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు మాదకద్రవ్యాల నియంత్రణ కోసం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు.. రాష్ట్రంలో గంజాయి సాగును గుర్తించి వాటి మూలాలను నిర్మూలించాలన్నారు.. పాన్ మసాలాతోపాటు 10 రూపాయలు అదనంగా ఇస్తే కిందనుండి మరో చిన్న ప్యాకెట్ తీసి బై వన్ గెట్ వన్ లాగా ఇస్తున్నారు. చిన్న ప్యాకెట్లు వలన చాలా ప్రమాదం ఉంది. క్యాన్సర్ బారిన పడే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు..

Read Also: Health Tips: ఉత్తమమైన ఆరోగ్యానికి.. బెస్ట్ కార్బోహైడ్రేట్ ఆహారాలు ఇవే

కేంద్రం చంద్రబాబు చేతుల్లో ఉంది కాబట్టి గుట్కా, పాన్ మసాలా తయారీ, ఉత్పత్తి కేంద్రాలను కట్టడి చేయాలని సూచించారు సీపీఐ నారాయణ.. చిన్న చిన్న షాపులను, వ్యక్తులను పట్టుకుంటూ వీధిలో నాటకాలు వేస్తే ఉపయోగం ఉండదన్నారు.. ఇక, గతంలో అమరావతి రాజధాని కోసం 30 వేల ఎకరాలను తీసుకున్నారు. వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో అమరావతి రాజధాని అభివృద్ధి కుంటుపడింది.. మరల చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధానికి పునర్జన్మ వచ్చిందన్నారు.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో చంద్రబాబు ఏడాదిగా పరిపాలన చేస్తున్నారు.. అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరో 40 వేల ఎకరాలు కావాలని చంద్రబాబు మాట్లాడడం బాధాకరం.. రైతులు మరలా భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా లేరన్నారు.. గతంలో ఇచ్చిన భూములకు సంబంధించి నిర్మాణాలు చేపట్టి, డెవలప్మెంట్ చూపిస్తే రైతులు ఆసక్తిగా మరో 40 వేల ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు.. పంటలు పండే భూములను ఈ విధంగా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో ఆహార సమస్యలు వస్తాయి.. సూపర్ సిక్స్ హామీలలో తల్లికి వందనం ఒక్క పథకం అమలు చేశారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అలివి కానీ హామీలు ఇచ్చారన్నారు..

Read Also: Kurnool POCSO Court: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. కర్నూలు పోక్సో కోర్టు సంచలన తీర్పు

గత ఐదేళ్లలో వైసీపీ చేసిన విధ్వంసం నుండి కోలుకోవడానికి సమయం పడుతుంది.. కూటమి ఏడాది పాలనలోనే అన్ని చేయమని మేము అడగడం లేదు.. అమరావతి రాజధానిలో విమానాశ్రయం రావాలన్నారు నారాయణ.. గన్నవరం విమానాశ్రయం చాలా చిన్నది ఇప్పటికే సరిపోవడం లేదు.. చంద్రబాబు చేస్తున్న హడావుడికి అమరావతి రాజధాని ప్రాంత ప్రజలకు నమ్మకం కలగడం లేదు.. పోలవరం ప్రాజెక్టు అంచనాలను మార్చేశారు. జగన్ తప్పిదాలు వలనే పోలవరం ప్రాజెక్టు అంచనాలు మారాయని చెప్తున్నారు.. జగన్ తప్పులు చేశారు కాబట్టే ప్రజలు 11 సీట్లు ఇచ్చారన్నారు. ఇక, సముద్రంలోకి వెళ్లే నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సమన్వయంగా వాడుకోవాలని సూచించారు.. బీజేపీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది.. 2029లోగా కులగనన జనగణన జరిగి తీరాలన్నారు.. త్వరలో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు ఆందోళన కార్యచరణ రూపొందిస్తాం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..

Exit mobile version