Site icon NTV Telugu

CM Chandrababu: నేడు మంగళగిరిలో సీఎం చంద్రబాబు భేటీ.. నేతన్నలతో ముఖాముఖి!

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (ఆగస్టు 7న) గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆటోనగర్‌లోని హ్యాండ్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (వీవర్స్‌శాల)కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు.

Read Also: Originals vs Brave: చివరి బంతి వరకూ ఉత్కంఠ.. ఓడిన ‘సంజీవ్ గోయెంకా’ జట్టు!

ఇక, మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేనేత స్టాల్‌లను సీఎం చంద్రబాబు సందర్శించి, చేనేత కార్మికులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అనంతరం చేనేత కార్మికులతో సీఎం మాట్లాడనున్నారు. ఇక, ప్రజావేదికపై నుంచి చేనేత కార్మికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 1.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు.

Exit mobile version