Site icon NTV Telugu

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్‌… కేసు నమోదు చేసిన పోలీసులు

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధారం రోజు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం విదితమే కాగా.. ర్యాలీ కి అనుమతి లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకున్నారు పోలీసులు.. దీంతో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు రాంబాబు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టి వేసి తన అనుచరులను తీసుకెళ్లారు.. ఈ నేపథ్యంలో పోలీసులు, అంబటి రాంబాబు మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది.. దీంతో, పోలీస్ విధులను అడ్డుకోవడంపై పట్టాభి పురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.. బీఎన్ఎస్ 132, 126(2), 351(3), 189(2) సెక్షన్ల కింద కేసు నమోదు పట్టాభిపురం పోలీసులు..

Read Also: Delhi Car Blast: బాంబు దాడికి ముందు మజీద్‌కి వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే.. (సీసీటీవీ ఫుటేజ్)

కాగా, బుధవారం రోజు అంబటి రాంబాబు.. గుంటూరులోని తన నివాసం నుంచి వైసీపీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయల్దేరారు.. అయితే, స్వామి థియేటర్ వద్ద రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు.. బారికేడ్లు పెట్టి ర్యాలీ ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు అంబటి.. ఈ క్రమంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు.. అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధమే జరిగింది.. దీంతో, వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీసుల వైఖరి నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఈ పరిణామాలో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, తాజాగా అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు..

Exit mobile version