NTV Telugu Site icon

Bouncer Murder: బౌన్సర్‌ దారుణ హత్య.. పవన్‌ సహా పలువురు సెలబ్రిటీల వద్ద పనిచేసిన బౌనర్స్‌..!

Bouncer Murder

Bouncer Murder

Bouncer Murder: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది.. పలువురు వీఐపీల దగ్గర బౌన్సర్ గా పని చేసే కోటేశ్వరరావు అనే వ్యక్తిని హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. కోటేశ్వరరావు పీక కోసి హత్య చేసి పరారయ్యరు.. మృతుడు కోటేశ్వరరావు గతంలో పవన్ కల్యాణ్‌ తోపాటు, పలువురు సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పని చేశాడని స్థానికులు చెబుతున్నారు… అయితే, హైదరాబాద్‌లో ఉంటున్న కోటేశ్వరరావు, 15 రోజుల క్రితం తెనాలి వచ్చాడు… రాత్రి మద్యం మత్తులో ఉన్న కోటేశ్వరరావును.. బుర్రిపాలెం రోడ్ లో, పీక కోసి హత్య చేశారు దుండగులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.. తెనాలిలో హత్యకు గురైన కోటేశ్వరరావు అనే యువకుడుది.. బుర్రిపాలెంగా గుర్తించారు పోలీసులు.. మృతుడు గతంలో పలువురు వీఐపీల దగ్గర బౌన్సర్ గా పని చేసినట్లు తెలుస్తుండగా.. పోలీసుల వద్ద కూడా ప్రైవేటు డ్రైవర్ గా గతంలో పనిచేశాడట.. అయితే, కోటేశ్వరరావు హత్యకు కారణం ఏంటి..? హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? కుటుంబ వ్యవహారాలా..? ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..

Read Also: Prashant Kishor: నేడు పీకే పార్టీ ప్రారంభం.. పార్టీ కీలక అంశాలు, ఎజెండా.?

Show comments