Constable Chiranjeevi: గుంటూరు జిల్లా తెనాలి పోలీసుల అరికాలి ట్రీట్మెంట్ రాష్ట్రంలో దుమారమే రేపింది.. పలు సంఘాలు పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు.. ఈ క్రమంలోనే.. బాధితుడు కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణి స్పందిస్తూ.. తన భర్తపై దాడి జరిగినప్పుడు మీరంతా ఎక్కడికి పోయారు? అంటూ నిలదీసిన విషయం విదితమే.. ఇక, రౌడీ షీటర్ల దాడికి గురైన కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు.. ఐతనగర్ లో చిరంజీవి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించిన శైలజ.. కానిస్టేబుల్ కుటుంబంతో మాట్లాడి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు..
Read Also: Hyundai Verna SX+: 5 స్టార్ భద్రతా ప్రమాణాలు, టాప్ క్లాస్ సౌకర్యాలతో హ్యుందాయ్ వెర్నా SX+ లాంచ్..!
ఇక, ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. తెనాలిలో నిన్న జరిగినది రాష్ట్రం అంత చూసారు.. మేం రాజకీయంగా రాలేదు.. కళ్యాణి మీడియాలో రక్షణ కావాలని కోరటంతో దాన్ని సుమోటోగా తీసుకొని ఇక్కడికి వచ్చాను.. కానిస్టేబుల్ భార్య అయ్యి ఉండి రక్షణ కల్పించాలని బహిరంగంగా కోరటం బాధాకరం.. నెల క్రితం కానిస్టేబుల్ పై దాడి చేశారు.. పోలీసులకు రౌడీ షీటర్లపై కక్ష ఉంటే నెల తరువాత కొడతారా? అప్పుడే కొట్టేవారుగా..? అని ప్రశ్నించారు.. నిందితులు దాడి చేసిన తర్వాత ఎంక్వయిరీ తర్వాతే రౌడీ షీటర్ల పై కేసు నమోదు చేశారు.. గంజాయి మత్తులో ఉండి దాడి చేస్తే యాక్షన్ తీసుకోకూడదా? రాజకీయ నాయకులు ప్రజల పక్షాన ఉండాలి.. బాధ్యతగా ఉండాలి.. రాజకీయ పార్టీలు రౌడీ షీటర్ల ఘటనలో సగం సమాచారం తెలుసుకొని రాకూడదు అని హితవు చెప్పారు. నిన్న రాజకీయ నాయకులు వచ్చి పరామర్శించిన ఘటన చూస్తే రౌడీ షీటర్లకు భరోసా ఇచ్చి అండగా ఉన్నామని చెప్పినట్టుంది.. పార్టీలపరంగా ఇలాంటి పరామర్శలు హర్షించదగ్గది కాదన్నారు.. పోలీసులు రక్షించాలని చెప్తారు.. చర్యలు తీసుకుంటే మాత్రం విమర్శలా? అని మండిపడ్డారు..
Read Also: IPL Chairman: ఆర్సీబీ విక్టరీ పరేడ్ గురించి నాకు తెలియదు..
కానిస్టేబుల్ భార్య భయపడుతున్నారు… వాళ్ల కుటుంబానికి ఏమన్నా జరిగితే రెస్పాన్సిబులిటీ ఎవరు తీసుకుంటారు..? అని ప్రశ్నించారు రాయపాటి శైలజ.. రాజకీయ నాయకులు కోరుకోవాల్సింది ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని.. మీ రాజకీయాల కోసం ఆడవారిని ఇబ్బంది పెట్టొద్దు అని సూచించారు.. మహిళా కమిషన్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంటుంది.. మహిళా కమిషన్ కి పార్టీలు, కులాలు మతాలు సంబంధం లేదు.. మహిళలే ముఖ్యం వారికి అండగా ఉంటాం అన్నారు.. కానిస్టేబుల్ భార్యకి ఊరు వదిలిపెట్టి వెళ్లే గత్యంతరం ఉండకూడదు.. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలి అని సూచించారు.. తెనాలి ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 105మందిపై గంజాయి కేసులు నమోదు చేశారు.. మహిళలను వేధించే వ్యక్తులకు శిక్ష వెంటనే పడితేనే భయం ఉంటుంది.. కళ్యాణి కి మహిళ కమిషన్ అన్ని రకాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ..
