Site icon NTV Telugu

Guntur: కలెక్టర్ గ్రీవెన్స్‌కు ఎనిమిదేళ్ల బాలుడు.. ఎందుకో తెలిస్తే ఔరా! అనాల్సిందే..

Guntur

Guntur

Guntur: సాధారణంగా కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు ఆ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలపై విన్నవించుకోవడానికి వస్తుంటారు.. కలెక్టర్‌ చొరవతో కొన్ని వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటే.. కొన్ని టైం తీసుకునే సమస్యలు కూడా ఉంటాయి.. అయితే, ఈ రోజు గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రత్యక్షమయ్యారు.. స్కూల్ బ్యాగ్‌ వేసుకునని.. చేతిలో ఓ ఫిర్యాదు పేపర్ పట్టుకుని కలెక్టరేట్‌లో నిర్వహిస్తోన్న గ్రీవెన్స్‌కు వచ్చాడు.. అయితే, ఆ బాలుడిని చూసి అంతా షాక్‌ అయ్యారు.. ఆ బుడతడికి వచ్చిన కష్టమేంటి? కలెక్టర్‌ దగ్గరకు ఎందుకు వచ్చాడు అనే రకరకాల ప్రశ్నలు వారి బుర్రల్లో మెదిలాయి..

Read Also: J-K: పహల్గాం తరహాలో భారీ ప్లాన్..? భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం..

అయితే, ఆ బాలుడు వచ్చింది.. తన సమస్యపై కాదు.. తన తల్లి సమస్యపై.. రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకునే తన తల్లికి కష్టం వచ్చింది.. ఇది ఆ బాలుడిని ఎంతో కలచివేసింది.. దీంతో, ఏకంగా కలెక్టర్ దృష్టికి ఆ సమస్యను తీసుకొచ్చాడు.. విషయం ఏంటంటే..? గుంటూరు గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (జీజీచ్) వద్ద తన తల్లి టిఫిన్ బండి నిర్వహించింది.. అయితే, అధికారులు.. ఆ టిఫిన్‌ బండిని మూయించారు.. దీంతో మనస్థాపానికి గురైంది ఆ తల్లి.. పొట్ట నింపే టిఫిన్‌ బండి మూతపడడంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితిలోకి వెళ్లిపోయింది.. అయితే, తల్లి ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ బాలుడు.. తల్లి ఆవేదన చూడలేక కలెక్టర్ కలిసేందుకు వచ్చాడు.. నాలుగో క్లాస్‌ చదువుతోన్న బాలుడు యశ్వంత్… ఇక, యశ్వంత్ సమస్యను విన్న కలెక్టర్ నాగలక్ష్మి.. వెంటనే బాలుడి తల్లి టిఫిన్ బండి పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.. కలెక్టర్‌ స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తూ ఆ బాలుడు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.. తల్లి ఆవేదన చూసి.. కలెక్టర్‌ దగ్గరకు వచ్చిన ఆ బాలుడి ధైర్యాన్ని చూసి.. అంతా ఔరా! అంటున్నారు..

Exit mobile version