Site icon NTV Telugu

Ambati Rambabu: లోకేష్ బెదిరింపులకు భయపడేదేలే.. రెడ్ బుక్కు మా ఇంట్లో కుక్క కూడా..

Ambati

Ambati

Ambati Rambabu: ​గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో 3 నెలల్లో 30 మంది చనిపోయిన వారి కుటుంబాలను వైసీపీ బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఒకే లక్షణాలతో ఎక్కువ మరణాలు సంభవించటంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను.. జగన్ ఆదేశానుసారం వైసీపీ బృందం వెళ్ళి ఆ గ్రామంలో 15 కుటుంబాలను పరామర్శించాం.. త్రాగు నీటి సమస్యల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని మా పరిశీలనలో ప్రాథమికంగా తేలింది.. ప్రభుత్వం ఇది కరెక్టా.. కాదా అని తేల్చుకోవాలి అని అంబటి రాంబాబు సూచించారు.

Read Also: హౌ డేర్ యూ?’ – ఎక్స్కవేషన్ ఇష్యూపై మహిళా IPS పై ఆగ్రహంతో అజిత్ పవార్

ఇక, సంజీవయ్య గుంట అనే ప్రాంతంలో నీరు నిల్వ కావడంతో కలుషితమైతుందని మాజీ మంత్రి రాంబాబు పేర్కొన్నారు. ఆ పాడుబడ్డ గుంట నుంచి నీళ్లను ట్యాంక్ లోకి ఎక్కించారు.. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు.. మా బృందం వెళ్తుందని తెలుసుకున్న తర్వాత స్థానిక ఎమ్మెల్యే వెళ్ళారు.. గ్రామంలో మంచినీళ్ళు దొరకటం లేదు కానీ మందు మాత్రం విచ్చలవిడిగా లభిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు.. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Read Also: GST 2.0 Impact: GST 2.0 లో కొత్త కార్ల ధరలు ఎంత తగ్గాయో తెలుసా..

అయితే, ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే తురకపాలెంలో మరణాలు సంభవించాయని వైసీపీ నేత అంబటి అన్నారు. జనం పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు.. నీరు కలుషితం కావటం వలనే ఇన్ని మరణాలు సంభవించాయి.. అసలు కలుషిత నీటిని ట్యాంకులోకి ఎక్కించిందెవరో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మేము ఈ గ్రామాన్ని పరిశీలించేంత వరకు ప్రభుత్వం మేల్కొనలేదు.. మద్యం బెల్టు షాపులు గ్రామంలో విచ్చలవిడిగా ఉన్నాయి.. మద్యం తాగేవారు ఎక్కువగా చనిపోయారు.. కనీసం కొంతకాలమైనా ప్రభుత్వం మినరల్ వాటర్ ని అందించాలి.. శానిటేషన్ అత్యంత అధ్వాన్నంగా ఉంది.. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తక్షణం ఆ గ్రామంలోని బెల్టు షాపులను వెంటనే తొలగించాలన్నారు.. ఇక మీదట తురకపాలెంలో ఒక్క ప్రాణం పోయినా సహించేది లేదని మాజీ మంత్రి రాంబాబు చెప్పుకొచ్చారు.

Read Also: Little Hearts : థియేటర్ లోనే ఏడ్చేసిన మౌళి పేరెంట్స్

అలాగే, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం దుర్మార్గం అని మాజీమంత్రి అంబాటి తెలిపారు. చంద్రబాబు తన తాబేదారులకు దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. తాను అవినీతి చేసినట్టు కొన్ని మీడియాల్లో వార్తలు రాశారు.. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే బ్యాచ్ మీరు.. నా మీద విజిలెన్స్ విచారణ అంటూ నానా హడావుడి చేస్తున్నారు.. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు.. మహా అయితే అరెస్టు చేస్తారు అంతేగా?.. అరెస్టు చేసినా భయపడేది లేదు.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా విచారణ చేస్తున్నారు.. నాపై మరో అక్రమ కేసు పెట్టటానికి ప్లాన్ చేస్తున్నారు.. కోర్టుల్లోనే తేల్చుకుంటా.. లోకేష్ బెదిరింపులకు భయపడే మనిషిని కాదు.. లోకేష్ రెడ్ బుక్ కు మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని అంబటి రాంబాబు వెల్లడించారు.

Exit mobile version