Site icon NTV Telugu

Ambati Rambabu: అరెస్ట్‌ల వెనుక రాజకీయ కుట్ర కోణం.. అక్రమ అరెస్టులకు అదరం, బెదరం..!

Ambatirambabu

Ambatirambabu

Ambati Rambabu: ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది.. అక్రమ అరెస్టులకు అదరం, బెదరం అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది.. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదు అని దుయ్యబట్టారు.. రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.. వైఎస్‌ జగన్ హయాంలో పని చేశారని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారన్న ఆయన.. చంద్రబాబుకు నీచపు రాజకీయాలు కొత్త ఏమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి జగన్ ను అక్రమ కేసులతో జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం అన్నారు..

Read Also: MLA Sudheer Reddy: మా అందరికీ రథసారధి కేసీఆర్.. పార్టీలో ఎవరి మధ్య విభేదాలు లేవు..

ఏపీ స్కిల్ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లాడనే కోపంతో వైసీపీ నేతలను, వైసీపీ హయాంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు అంబటి రాంబాబు.. పులి మీద చంద్రబాబు, నారా లోకేష్ స్వారీ చేస్తున్నారు.. ఆ స్వారీ చేయటం ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుందని వ్యాఖ్యానించారు.. అమ్మ ఒడి వంటి పథకాలను ప్రజలు అడగకుండా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు.. అందుకే ఈ అక్రమ అరెస్ట్‌లు అంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అంబటి రాంబాబు..

Exit mobile version