NTV Telugu Site icon

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు..

Vidala Rajani

Vidala Rajani

మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజనీ వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా.. విడదల రజనీ మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో.. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలో ఉన్న 7, 7ఏ, IPC లో ఉన్న 384, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లంచం తీసుకోవటం, అనుచిత లబ్ధి చేకూర్చటంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

Read Also: VT15 Movie : వర్క్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతున్న వరుణ్ తేజ్

బెదిరింపులు, అక్రమ వసూళ్లపై ముందు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్‌కు ఫిర్యాదు అందగా.. విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో.. ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో.. శనివారం విడదల రజనీపై కేసు నమోదు చేశారు అధికారులు.