Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Guntur District Tadikonda Constituency Ysrcp Present Situation

YSRCP: తాడికొండ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు.. డైలమాలో పడిన ఎమ్మెల్యే గ్రూప్

Published Date :August 23, 2022 , 11:46 am
By Ramesh Nalam
YSRCP: తాడికొండ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు.. డైలమాలో పడిన ఎమ్మెల్యే గ్రూప్
  • Follow Us :
  • google news
  • dailyhunt

YSRCP: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ అధిష్టానం నియమించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి ఏకంగా జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటివద్ద ఆందోళనకు దిగారు. డొక్కా గో బ్యాక్ అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ నినాదాలు చేశారు. కానీ రెండు రోజుల్లో నేతలు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. నిన్నటివరకూ డొక్కాకు అదనపు సమన్వయకర్త పదవి రద్దు చెయ్యాలని అధిష్టానాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే వర్గీయులు ఇప్పుడు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు. సమన్వయకర్తగా నియమించిన తర్వాత డొక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. సమన్వయకర్తగా నియమించిన తర్వాత తాడికొండ అడ్డరోడ్డువద్ద సమావేశమవుతున్న ఎమ్మెల్యే వర్గీయులను కలిశారు. మళ్లీ ఎందుకు సమావేశమంటూ వారితో నేరుగా మాట్లాడడంతో అక్కడ నేతలకు ఏం మాట్లాడాలో కూడా అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో మేము మీకు వ్యతిరేకం కాదంటూ సమాధానమిచ్చారు. అంతటితో ఆగని డొక్కా మొదటిసారిగా తుళ్లూరు మండలం వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లారు. వెంకన్నను దర్శించుకున్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే వర్గీయులు మినహా మిగతా వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Read Also: AP Cabinet Meeting: ఈనెల 29న ఏపీ కేబినెట్ సమావేశం.. ప్రతిపాదనలు పంపాలని సీఎస్ ఉత్తర్వులు

ఈ నేపథ్యంలో తాడికొండ నియోజకవర్గంలో డొక్కా మొదటి పర్యటన తర్వాత ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయులు డైలమాలో పడ్డారు. నిన్నటివరకూ ఎమ్మెల్యే ఉండగా సమన్వయకర్తను ఎలా నియమిస్తారంటూ మాట్లాడిన ఎమ్మెల్యే వర్గీయులు ఇప్పుడు కొత్తరాగం అందుకున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ప్రకటించారు. సమన్వయకర్తగా నియమించిన తర్వాత నియోజకవర్గానికి వస్తున్నట్లు తమకు సమాచారం ఇస్తే తాము కూడా పాల్గొనేవారమంటున్నారు. పార్టీలో గ్రూపులు లేకుండా అందరినీ కలుపుకుపోవాలని కోరుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే శ్రీదేవికి విలువ తగ్గకుండా చూడాలని కూడా కోరుతున్నారు. నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా కలిసి నేతలందరిని సమన్వయం చేస్తే ఇబ్బంది తొలగిపోతుందంటున్నారు. మొత్తానికి డొక్కా తొలి పర్యటన ద్వారా ఎమ్మెల్యే వర్గీయులు డిఫెన్స్‌లో పడేలా చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కలిసి మాట్లాడుకోవాలని నేతలు కోరుతున్నారు. ఇప్పటికే తాను ఎమ్మెల్యేను కలుస్తానని డొక్కా చెప్పారు. ఇద్దరూ కలిసి సమావేశం ఏర్పాటు చేస్తే అంతా సర్దుకుంటుందని వైసీపీ అభిమానులు కోరుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • dokka manikyavaraprasad
  • guntur ysrcp
  • MLA Sridevi
  • Tadikonda Constituency
  • YSRCP

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions