NTV Telugu Site icon

Breaking: విశాఖలో తుపాకీతో బెదిరించి బ్యాంకు లూఠీ..

Robbery

Robbery

ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ దొంగలు కలకలం సృష్టించారు.. పట్టపగలే బ్యాంకులోకి దూరి.. తుపాకీతో బెదిరించి అందినకాడికి ఎత్తుకెళ్లారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఓ బ్యాంకులో లూఠీ జరిగింది.. అనకాపల్లిలోని నర్సింగబిల్లి గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌లో ఈ ఘటన జరిగింది.. బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు.. బ్యాంకు సిబ్బందిని తుపాకీతో బెదిరించి అందినకాడికి నగదు ఎత్తుకెళ్లారు. ఇక, బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అనకాపల్లి పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకులోని సీసీ ఫుటేజ్‌తో పాటు.. నర్సింగబిల్లిలో ఇతర సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. బ్యాంకు సిబ్బందిని గన్‌తో బెదిరించి దోపీడీకి పాల్పడిన ఘటన ఏపీలో కలకలం సృష్టిస్తోంది.

Read Also: RK Roja: కేటీఆర్‌ వ్యాఖ్యలను లోకేష్‌ వక్రీకరించారు..!

ఇక, నర్సింగబిల్లి గ్రామీణ వికాస్ బ్యాంకు దోపిడీ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు, బ్యాంకు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. ఘటనా స్థలాన్ని ఎస్పీ గౌతమి శాలి పరిశీలించారు.. నిందితుడు ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిందీ మాట్లాడుతూ… వెపన్‌తో తిరిగుతున్నట్టు గుర్తించారు.. దోపిడీకి వాడినది డమ్మీ పిస్టల్ లేదా కంట్రిమేడ్ తపంచాగా అనుమానిస్తున్నారు పోలీసులు.. విశాఖ, పాయకరావుపేట వైపు వెళ్లే రహదారుల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.