Gudivada Amarnath Open Offer To Janasena: జనసేనకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. రేపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విస్సన్నపేట భూములకు వెళ్ళడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అక్కడ ఒక్క సెంటు భూమి తన పేరు మీద ఉందని నిరూపిస్తే.. అప్పటికప్పుడే ఆ భూమిని జనసేనకు రాసిచ్చేస్తానని అన్నారు. అందుకు జనసేన సిద్ధమా..? అని సవాల్ విసిరారు. అసలు రుషికొండ నిర్మాణాలపై అనుమానాలు ఎందుకని ప్రశ్నించారు. అక్కడ సీఎంవో, సెక్రటేరియెట్, సీఎం నివాసంతో పాటు ఇంకా ఏదైనా రావొచ్చన్నారు. ప్రభుత్వ స్థలంలో జరిగే భవనాలను ఏ విధంగానైనా వాడుకోవచ్చన్నారు. గాజువాకలో మీటింగ్‌కు వెళ్తున్న పవన్ అక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
Air Hostess: శృంగార సేవలు అందిస్తున్న ఎయిర్ హోస్టెస్‌లు.. ఒక రాత్రికి 2.4 లక్షలు!
గెలిచినా, ఓడినా గాజువాకలో ఉంటానన్న పవన్‌కు ఎందుకు ఆ ప్రాంతం కనిపించలేదని మంత్రి అమర్నాథ్ నిలదీశారు. మరోసారి గాజువాక నుంచి పోటీ చేస్తారా? లేదా? అనేది క్లారిటీ ఇవ్వాలన్నారు. నా తల్లిని అవమానించిన టీడీపీ నేతల సంగతి తేలుస్తానన్న పవన్.. ఇప్పుడు వాళ్లకు ఎందుకు ఊడిగం చేస్తున్నారని అడిగారు. 15 సీట్లు ఇస్తే కుక్కలా పడి ఉంటారని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌కు వినిపించలేదా? అని ప్రశ్నించారు. రుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్స్ ఎగురవేసినందుకు పవన్ కళ్యాణ్‌పై మరోసారి చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం కడుతున్న చోటకు అనుమతి లేకుండా ప్రవేశిస్తామంటే ఎందుకు అంగీకరించాలన్నారు. అనుమతి లేకుండా చేసిన పనికి పోలీసు కేసు పెడతామన్నారు.
Bank Loan: లోన్ తీసుకుంటున్నారా గుడ్ న్యూస్.. ఇకపై నో ప్రాసెసింగ్ ఫీజు
