NTV Telugu Site icon

GIS 2023: జీఐఎస్‌ చారిత్రాత్మక విజయం సాధించింది.. సీఎం వల్లే ఇది సాధ్యమైంది

Gis 2023 Speeches

Gis 2023 Speeches

Gudivada Amarnath Minister Roja Kishan Reddy In GIS 2023: విశాఖపట్టణం వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ చారిత్రాత్మక విజయం సాధించిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌ కేవలం మాటల మనిషి కాదని.. చేతల మనిషి అని.. ఈ సమ్మిట్‌తో అది మరోసారి నిరూపితమైందని అన్నారు. సీఎం జగన్‌ దార్శనికతతో పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. వివిధ దేశాల నుంచి ప్రసిద్ధ సంస్థలు జీఐఎస్‌కు వచ్చాయని, రెండు రోజల సదస్సులో​ విలువైన చర్చలు జరిగాయని వెల్లడించారు. పారిశ్రామికవేత్తల అంచనాలకు తగినట్టు ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ క్రెడిబిలీటీ గల నాయకుడని, పారిశ్రామికవేత్తల అభిప్రాయాల అధారంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌వన్‌ అయ్యిందని చెప్పారు. ఏపీలో పలు రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న ఆయన.. నేడు ఏపీకి వస్తున్నవన్నీ రియలిస్టిక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అని తెలిపారు. పారిశ్రామిక దిగ్గజాలు చెప్పిన మాటలను ప్రతిపక్షాలు అవగాహన చేసుకోవాలని సూచించారు. ప్రతి ఎంవోయూ పారదర్శకంగా రూపొందిందని, మూడేళ్లలో 89 శాతం ఎంవోయూలు వాస్తవరూపం దాల్చాయని చెప్పుకొచ్చారు.

CM Jagan: ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం.. 13 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి

ఇదే సమయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని, ప్రపంచ ఆర్థికప్రగతిలో భారత్ కీలకమని ఐఎంఎఫ్‌ ప్రకటించిందని అన్నారు. ప్రతిభగల యువత ఏపీలో ఉందని, నైపుణ్యం గల మానవ వనరులు ఏపీ సొంతమని పేర్కొన్నారు. అటు.. సీఎం జగన్‌ సమర్ధవంతమైన నాయకత్వం వల్లే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని మంత్రి రోజా అన్నారు. ప్రజలు సీఎం జగన్‌పై పెట్టుకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని, పారదర్శకమైన పాలన వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఇక మంత్రి సర్బానంద సోనోవాల్‌ మాట్లాడుతూ.. జీఐఎస్‌‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో విశాఖ ప్రత్యేక నగరంగా నిలిచిందని, విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమైన విషయమని అన్నారు. శతాబ్దాలుగా భారత్‌లో విశాఖ కీలకంగా ఉందన్న ఆయన.. ఏపీ వేగంగా అభివృద్ధి చెందడానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖ పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలియజేశారు.

Nitro Star: ‘మామా మశ్చీంద్ర’ నుండి పరశురామ్ క్యారెక్టర్ లుక్ రిలీజ్

Show comments