మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత పవన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు డైరెక్షన్లో మూడు నెలలుగా బ్రహ్మాండమైన సినిమా నడుపుతున్నారు…. అది అట్టర్ ఫ్లాప్ అయిపోవడం ఖాయం అన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు లేదన్నారు అమర్నాథ్.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం అడుకుంటోంది. రైతులను మోసం చేసింది చంద్రబాబు అనేది దత్తపుత్రుడు తెలుసుకోవాలి. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనుసరించిన మోసపూరిత హామీలే కౌలు రైతుల ఆత్మహత్యలకు మూలం. టీడీపీ హయాంలో కౌలురైతుల ఆత్మహత్యల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్ వ్యవహరిస్తున్నారు. రైతులపై కాల్పులు జరిపిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తుంటేనే అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు వలన, చంద్రబాబు చేత పుట్టిన పార్టీ జనసేన. చంద్రబాబు ఆలోచనలు,ఆశయాలు కోసం పనిచేయడం తప్ప జనసేనకు ఒక విధానం లేదని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ రాజకీయ, వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్ లేని వాడు. ఒక లోకల్, ఒక నేషనల్,ఒక ఇంటర్నేషనల్ ఇదీ పవన్ కళ్యాణ్ బహు భార్యత్వం తీరు.
Read Also:Yanamala Ramakrishnudu: అప్పుల ఊబిలో ఏపీ ఉక్కిరిబిక్కిరి
అక్రమంగా పెట్టిన కేసుల్లో 16నెలలు జైల్లో ఉంటే నేరగాళ్లు అనడానికి పవన్ కళ్యాణ్ కు హక్కు ఎక్కడుంది. అతితక్కువ కాలంలో ఎక్కువ పొత్తులు పెట్టుకున్న రాజకీయ పార్టీగా జనసేనది వరల్డ్ రికార్డ్ అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని విమర్శించారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయంగా దిగజారిపోయారు. చివరికి కే. ఏ.పాల్ కూడా తనతో పాటు వస్తే పవన్ ను సీఎం చేస్తానని ఆహ్వానించే స్థాయికి చేరారు. సింహం సింగిల్ గా వస్తుంది….పందులు గుంపుగా వస్తాయి…. పవన్ కళ్యాణ్ ఏ విధంగా వస్తారో చూసుకోవాలన్నారు అదీప్ రాజ్.