ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ(ఫిబ్రవరి 23) నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఒక వైపు అభ్యర్థుల ఆందోళనలు మరో వైపు చివరి నిమిషం వరకు రాని స్పష్టత నడుమ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. గ్రూప్-2 మెయిన్స్ కు 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొత్తం 92,250 మంది అభ్యర్థుల్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నవారు 86,459 మంది ఉన్నారు. 80 వేలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు సమాచారం.
Also Read:US deports Indians: అక్రమ వలసదారుల బహిష్కరణ.. ఇండియా చేరిన 4వ బ్యాచ్..
గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి నిన్న హైడ్రామా నడిచింది… రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు వాయిదా వెయ్యాలని లేఖ రాసినా ఏపీపీఎస్సీ పరిగణనలోకి తీసుకోలేదు. పరీక్షలు వాయిదా వేయలేమని ప్రకటించింది. దీంతో యధావిధిగా పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 2 పరీక్షల అంశం వచ్చే నెల 11 న హై కోర్ట్ లో విచారణకు రానుంది.
Also Read:Health Tips: ఈ కూరగాయలను ఎక్కువగా తింటున్నారా? ఆ సమస్యలను ఏరికోరి తెచ్చుకున్నట్లే?
అభ్యర్థులు పరీక్షలు ముగిసిన కూడా రోస్టర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తాం అని చెబుతున్నారు. ప్రస్తుతం పరీక్షలు ముగియడంతో అభ్యర్థుల కార్యాచరణ పై దృష్టి పెట్టారు. పరీక్షలు జరిగి ఉద్యోగాల్లో చేరిన తర్వాత కూడా నోటిఫికేషన్ రద్దు అయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో మరి ఈ గ్రూప్ 2 వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.