Deputy CM Pawan: గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష..

  • గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష..
  • 2030 నాటికి రాష్ట్రంలోని 1,034 కి. మీ తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ బెల్ట్‌..
  • జీవన పర్యావరణ కవచం"దీని ద్వారా ఏర్పాటు చేస్తున్నాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Pawan

Pawan

Deputy CM Pawan: గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ పై సచివాలయంలో అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని గ్రేట్ గ్రీన్ వాల్ ను 2030 నాటికి రాష్ట్రంలోని 1,034 కిలో మీటర్ల తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పు గల గ్రీన్ బెల్ట్‌ను సృష్టికి నిర్దేశించిన పర్యావరణ ప్రాజెక్ట్ అన్నారు. తుఫానులు, సముద్ర మట్టం పెరుగుదల, కోత నుంచి రక్షించడానికి “జీవన పర్యావరణ కవచం”దీని ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Read Also: Xiaomi EV Cars: మొబైల్స్తో పాటు కార్ల తయారీ.. 2026లో ఏకంగా 5.5 లక్షల ఈవీల ఉత్పత్తి..

×
×
Ad

ఇక, జీవ వైవిధ్యం, జీవనోపాధిని పెంచేలా ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. ఆఫ్రికన్ గ్రేట్ గ్రీన్ వాల్ నుంచి ప్రేరణ పొంది మడ అడవులు, సరుగుడు, ఇతర ఉప్పు-తట్టుకునే చెట్ల తోటలపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి అటవీ- పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ప్రిన్సిపల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు పీవీ చలపతి రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.