Site icon NTV Telugu

New Districts: కొత్త జిల్లాలను ఆహ్వానించిన గవర్నర్.. సీఎంకు అభినందనలు

Governor Vishwa Bhushan

Governor Vishwa Bhushan

ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం ఆరంభం.. కొత్తగా 13 జిల్లాలతో మొత్తం 26 జిల్లాల్లో పాలన ప్రారంభించారు.. కొత్త జిల్లాలను సీఎం వైఎస్ జగన్.. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ బటన్ నొక్కి కొత్త జిల్లాలు అమలులోకి వచ్చినట్టు వెల్లడించారు సీఎం వైఎస్‌ జగన్.. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటును ఆహ్వానించారు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్..

Read Also: Perni Nani: బాబు సొరకాయలు కోస్తారు?  పవన్ కి ఏం తెలుసు? 

నూతన జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపిన గవర్నర్ బిశ్వభూషణ్.. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌తో పాలనా చరిత్రలో నవశకానికి నాంది పలికిందని అభివర్ణించారు.. పాలనా సౌలభ్యం కోసం 23 నూతన రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు ముదావహంగా పేర్కొన్న ఆయన.. అన్ని ప్రాంతాల ఏకీకృత అభివృద్దికి బాటలు వేస్తుందన్నారు.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వంలో మరింత పారదర్శకతను తీసుకు వస్తుందన్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.

Exit mobile version