Site icon NTV Telugu

Server Down: సర్వర్‌ డౌన్‌.. ఏపీలో డిజిటల్‌ సేవలకు బ్రేక్‌..

Server Down

Server Down

Server Down: ఇప్పుడంతా డిజిటల్‌ మయం.. కొద్దిసేపు డిజిటల్‌ సేవలను నిలిచిపోయినా పని నడవని పరిస్థితి.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు డిజిటల్‌ సేవలకు బ్రేక్‌ పడింది.. ఏపీలో స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్‌ అయ్యింది.. ఎస్డీసీ సర్వర్ డౌన్ వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సేవలు నిలిచిపోయాయి.. దీంతో.. ఉద్యోగుల అటెండెన్స్ యాప్, ఇతర వెబ్ సర్వీసులకు కూడా బ్రేక్‌ పడింది.. డేటా సెంటర్‌లో అంతరాయం ఏర్పడడం వల్ల డిజిటల్ సేవలకు అంతరాయం ఏర్పడింది.. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తోన్న సమయంలో.. సర్వర్‌లో ఈ సమస్య తలెత్తింది.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల అటెండెన్స్‌తో పాటు.. ఇతర సర్వీలకు తీవ్ర అంతరాయం కలిగింది.. ఇక, రంగంలోకి దిగిన సాంకేతిక నిపులు.. సమస్యను పరష్కరించేందుకు కృషి చేస్తున్నారు.. అంతా డిజిటల్‌ సేవలపై ఆధారపడి ఉద్యోగులు పనిచేస్తున్నందున వీలైనంత తొందరగా సమస్యకు చెక్‌ పెట్టే విధంగా చర్యలు చేపట్టారు.

Read Also: TS Inter Exams: టెన్షన్‌ వద్దు.. ‘సెంటర్‌ లొకేటర్‌’ యాప్‌తో ఎగ్జామ్‌ సెంటర్‌కు వెళ్లడం ఇక ఈజీ

Exit mobile version