Site icon NTV Telugu

సర్కార్‌ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో ఇక మటన్‌ మార్ట్‌లు..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… రాష్ట్రంలో మటన్ మార్ట్ ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది… ఆరోగ్యకరమైన మాంసం వినియోగం పెంచటమే లక్ష్యంగా మార్ట్ లు ఏర్పాటు చేయనుంది.. తొలి దశలో విశాఖ, విజయవాడల్లో నాలుగు చొప్పున ఈ మార్ట్‌లు ఏర్పాటు చేసే యోచనలో ఉంది ఏపీ సర్కార్.. ఆ తర్వాత మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.. రూ.11.20 కోట్లతో 112 మార్ట్‌లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.. పరిశుభ్రమైన వాతావరణంలో రిటైల్ అవుట్స్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు అధికారులు.. దశలవారీగా మిగిలిన ప్రాంతాలకు విస్తరించడానికి సర్కార్ కసరత్తు చేస్తోంది. కాగా, ఇప్పటికే మద్యం షాపులను నిర్వహిస్తోన్న ప్రభుత్వం.. తాజాగా, సినిమా టికెట్ల విక్రయం వైపు కూడా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మటన్‌ విక్రయంపై దృష్టి సారించింది ఏపీ సర్కార్.

Exit mobile version