Good news to sanitation workers in andhra pradesh: పారిశుధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పారిశుధ్య కార్మికులకు ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 233 ప్రభుత్వం విడుదల చేసింది. నెలకు రూ.6 వేలు ఈ అలవెన్స్ కింద అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం పారిశుధ్య కార్మికులకు మూలవేతనంగా రూ.15 వేలు అందుతోంది. ప్రస్తుతం హెల్త్ అలవెన్స్ కింద అదనంగా రూ.6వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వీరి జీతం రూ.21 వేలకు పెరిగింది. తాజా ఉత్తర్వులతో దాదాపు 43 వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
Read Also: Deepesh Bhan: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి
ఇటీవల రాష్ట్రంలో తమ జీతాలు పెంచాలంటూ మున్సిపల్, కార్పొరేషన్లలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా ఆరోగ్య భృతిని కూడా తమ డిమాండ్లలో కార్మికులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పారిశుధ్య కార్మికులతో మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. చర్చల అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను సీఎం జగన్ ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంపై అధికారులతో చర్చించి కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు.
