NTV Telugu Site icon

జర్నలిస్టులకు శుభవార్త.. 25 వేల మందికి అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు..!

sajjala ramakrishna reddy

sajjala ramakrishna reddy

జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. త్వరలో రాష్ట్రంలోని 25 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఇవాళ సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని, అధికారులతో సమావేశమైన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు… వార, పక్ష, మాస పత్రికలకు సర్క్యులేషన్ బట్టి అక్రిడేషన్లు కేటాయించాలని తెలిపారు. దీంతో.. అక్రిడేషన్ల కోసం ఎదురుచూస్తోన్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పినట్టు అయ్యింది…